రియల్ ఎస్టేట్ సమస్యల్లో సునీల్

రియల్ ఎస్టేట్ సమస్యల్లో సునీల్

Published on Jan 9, 2012 9:55 AM IST


కామెడీ హీరో కొన్ని రియల్ ఎస్టేట్స్ సమస్యల్లో ఇరుక్కున్నాడు. కంగారు పడకండి అతని నిజ జీవితంలో కాదు. సునీల్ హీరోగా నటించిన ‘పూలరంగడు’ చిత్రంలోని అతని పాత్ర గురించి చెప్తున్నాం. ఈ చిత్రంలో సునీల్ పాత్ర రియల్ ఎస్టేట్ బిజినెస్ లో బాగా సంపాదించి తరువాత రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయి ఏం చేయాలో తెలియని పరిస్తుతుల్లో ఏం చేసాడనేది చిత్ర కథ. ఫిబ్రవరి 3న విడుదల కాబోతుంది. అనూప్ రూబెన్స్ అందించిన ఈ చిత్ర ఆడియో ఈ నెల 15న విడుదల కాబోతుంది.

ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా ఫిబ్రవరికి వాయిదా పడింది. సునీల్, ఇషా చావ్లా జంటగా నటించిన ఈ చిత్రానికి వీరభద్రమ్ చౌదరి దర్శకుడు. మాక్స్ ఇండియా బ్యానర్ పై కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. కోట శ్రీనివాస్ రావు, ప్రదీప్ రావత్, అలీ, రఘుబాబు మరియు ప్రగతి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు