
ఫేమస్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ బాలీవుడ్ లో చేసిన ‘జిస్మ్ 2’ సినిమాతో ఇండియాలో మంచి క్రేజ్ తెచ్చుకొని తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకి మత్తెక్కిస్తోంది. ఈ భామ మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న ‘కరెంట్ తీగ’ సినిమాతో తెలుగు తెరపై కూడా కనిపించనుందని ఇది వరకే తెలియజేశాం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సన్నీ లియోన్ ఓ గ్లామరస్ టీచర్ పాత్రలో కనిపిస్తుందని అంటున్నారు.
ఓ కీలక పాత్రలో మాత్రమే కనిపించనున్న సన్నీ లియోన్ పై ఓ ప్రత్యేక పాట కూడా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ సినిమాకి అచ్చు సంగీతం అందిస్తున్నాడు.

