స్పెషల్ అట్రాక్షన్ : సన్నీ లియోన్ లుంగీ డాన్స్

స్పెషల్ అట్రాక్షన్ : సన్నీ లియోన్ లుంగీ డాన్స్

Published on Jul 10, 2014 8:00 AM IST

sunny-leone-lungi-dance-for
లుంగీ డాన్స్.. లుంగీ డాన్స్.. ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ సినిమా పబ్లిసిటీ కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ పై చిత్రీకరించిన ఈ పాట ఇండియా మొత్తం ఒక రేంజ్లో ఊపింది. తలైవా.. తలైవా.. అంటూ షారుఖ్ ఖాన్, దీపిక పదుకొనె వేసిన స్టెప్పులు అభిమానులను అలరించాయి. సినిమా సూపర్ హిట్. తర్వాత ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కళ్యాణ్ లుంగీలో అలరించాడు. ఓరి దేవుడో.. పాటలో లుంగీతో స్టెప్పులు వేశాడు. ‘అత్తారింటికి దారేది’ బ్లాక్ బస్టర్ అయ్యింది. తాజాగా మంచు మనోజ్ తన కొత్త సినిమా కోసం లుంగీ డాన్స్ చేస్తున్నాడు.

మంచు మనోజ్, రాకుల్ ప్రీత్ నటిస్తున్న తాజా సినిమా ‘కరెంటు తీగ’. ఈ సినిమాలో సన్నీ లియోన్ ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాటలో మంచు మనోజ్, సన్నీ లియోన్ లుంగీలో స్టెప్పులు వేయనున్నారు. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ జరుగుతుంది. బృంద మాస్టర్ కోరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సాంగ్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. ‘చెన్నై ఎక్స్ ప్రెస్’, ‘అత్తారింటికి దారేది’ సినిమాల దారిలో ‘కరెంటు తీగ’ కూడా సూపర్ సక్సెస్ సాదిస్తుందని ఇప్పటి నుంచే అభిమానులు ఫిక్స్ అయిపోయారు.

తాజా వార్తలు