సూపర్ క్లిక్స్ : శంకర్ కూతురి పెళ్లి వేడుకలో కోలీవుడ్ స్టార్స్ సందడి

సూపర్ క్లిక్స్ : శంకర్ కూతురి పెళ్లి వేడుకలో కోలీవుడ్ స్టార్స్ సందడి

Published on Apr 15, 2024 8:01 PM IST

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్, కమల్ హాసన్ తో భారతీయుడు 2 మూవీస్ చేస్తున్నారు. విషయం ఏమిటంటే, అయన పెద్ద కూతురు ఐశ్వర్యతో తరుణ్ కార్తికేయన్ వివాహం నేడు (ఏప్రిల్ 15) చెన్నైలో ఎంతో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు కోలీవుడ్ స్టార్స్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వారిలో సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్, సూర్య, కార్తీ, విక్రమ్ హాజరయ్యారు. కాగా శంకర్ కూతురు ఐశ్వర్యకు ఇది రెండో వివాహం. 2021లో ఆమె దామోదరన్ రోహిత్ అనే క్రికెటర్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. అయితే, కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా రోహిత్‍తో ఐశ్వర్య విడిపోయారు. ఇప్పుడు, అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తీకేయన్‍ను వివాహం చేసుకున్నారు. మొత్తంగా ఐశ్వర్య, తరుణ్ ల వివాహం వైభవంగా జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు