సూపర్ క్లిక్స్ : స్టైలిష్ లుక్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు

సూపర్ క్లిక్స్ : స్టైలిష్ లుక్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు

Published on Apr 2, 2024 12:29 AM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీ తో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్లిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితం గుంటూరు కారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన మహేష్, ఆ మూవీతో మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు.

ఇక త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రారంభం కానున్న గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ SSMB 29 మూవీ కోసం సన్నద్ధం అవుతున్నారు సూపర్ స్టార్. విషయం ఏమిటంటే, ఇటీవల విదేశాలకు వెళ్లే ముందు ఆయన దిగిన ఫోటోషూట్ తాలూకు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్రెండీ కాస్ట్యూమ్స్ లో అదరగొట్టే లుక్స్ లో మహేష్ బాబు ఆ పిక్స్ లో ఎంతో యంగ్ గా కనపడుతున్నారు. ఆ స్టైలిష్ ఫొటోల్లో మహేష్ ని చూసిన పలువురు ఆయనకి ఏజ్ రెవర్స్ అవుతుండడంతో పాటు గ్లామర్ మరింతగా పెరుగుతోందని మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు