
మెగాస్టార్ చిరంజీవి ఎట్టకేలకు టాలీవుడ్ కి తన కమ్ బ్యాక్ ని ప్రకటించడంతో తన అభిమాన గణం సంతోశాలలో మునిగితేలారు. తన 150వ సినిమా దర్శకుడు పూరి జగన్నాధ్ తో వుంటుందని తెలుపడంతో చిరు సెకండ్ ఇన్నింగ్స్ పై ఆసక్తి పెరిగింది.
ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు షాట్ గానీ, అధికారిక లాంచ్ గానీ చిరంజీవి పుట్టినరోజునాడు జరగనున్నట్టు ఇప్పటికే సమాచారం. అయితే ఈ విషయమే కాక మెగా అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇవ్వడానికి రామ్ చరణ్ సిద్ధమయ్యాడు. తను హీరో గా శ్రీను వైట్ల దర్శకత్వంలో నటిస్తున్న చిత్ర ఫస్ట్ లుక్ ని ఆరోజు విడుదల చేసే యోచనలో వున్నట్టు సమాచారం. ఈ వార్తపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినా తనయుడి సినిమా టీజర్ ని విడుదలచేయడానికి తండ్రి జన్మదినం కంటే గొప్ప రోజేముంటుంది చెప్పండి.