రవితేజ ‘కిక్ 2’కి సూపర్బ్ ఓపెనింగ్స్.!

రవితేజ ‘కిక్ 2’కి సూపర్బ్ ఓపెనింగ్స్.!

Published on Aug 19, 2015 7:29 PM IST

kick-2
2009లో వచ్చిన ‘కిక్’ సినిమాతో సూపర్ హిట్ కాంబినేషన్ అనిపించుకున్న మాస్ మహారాజ్ రవితేజ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘కిక్ 2’. సీక్వెల్ లా ఈ సినిమాకి ఫస్ట్ పార్ట్ కి ముడి పెట్టినా ఆ సినిమాకి పూర్తి డిఫరెంట్ గా ఉండే కథ కిక్ 2 లో ఉంటుందంటున్న ఈ సినిమా ఆగష్టు 21న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే అబ్రాడ్ కి వెళ్ళాల్సిన హార్డ్ డిస్క్స్ కూడా బయలుదేరిపోయాయి. ఇదిలా ఉంటే కిక్ 2 సినిమాకి గత వారంగా జరుగుతున్న హై ప్రమోషన్స్ వలన ప్రేక్షకులలో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. దాంతో ఈ సినిమాకి ఫస్ట్ వీకెండ్ భారీగా ఓపెనింగ్స్ వస్తున్నాయి.

ఈ రోజు నుంచి కిక్ 2 సినిమాకి సంబందించిన ఆన్ లైన్ బుకింగ్ ఓపెన్ చేసారు. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకి ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి. ఇప్పటికే మెయిన్ సిటీ, టౌన్ లలో దాదాపు 70% టికెట్స్ అమ్ముడు పోయాయి. ఈ ఓపెనింగ్స్ చూసిన ట్రేడ్ వర్గాలు మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సుమారు 6 కోట్లకి పైనే షేర్ మార్క్ కలెక్ట్ చేస్తుందని ఈ చిత్ర టీం అంటోంది. అనుకున్న విధంగా ఈ మార్క్ ని రీచ్ అయితే ‘కిక్ 2’నే కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన మూవీ అవుతుందని ట్రేడ్ రిపోర్టర్స్ చెబుతున్నారు. ‘కిక్’ సినిమా పెద్ద హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

రవితేజకి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ సినిమాని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించాడు. బ్రహ్మానందం, రాజ్పల్ యాదవ్, సంజయ్ మిశ్రా లాంటి కమెడియన్స్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు