చైతూ “ధూత” వెబ్ సిరిస్ కు సూపర్ రెస్పాన్స్!

చైతూ “ధూత” వెబ్ సిరిస్ కు సూపర్ రెస్పాన్స్!

Published on Dec 3, 2023 10:02 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య ప్రధాన పాత్రలో, డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వం లో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ ధూత వెబ్ సిరీస్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమయ్యే ఈ సిరీస్ నాగ చైతన్య పోషించిన ప్రఖ్యాత జర్నలిస్ట్ సాగర్ జీవితంలో జరిగిన సంఘటనలపై దృష్టి సారిస్తుంది. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఇందులో చిత్రీకరించారు. ఇందులోని నాటకీయ అంశాలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి.

ధూత దాని ఇన్వెస్టిగేషన్ కథాంశంతో ఆకట్టుకుంటుంది. ఈ వెబ్ సిరీస్ రికార్డ్ స్థాయిలో వ్యూస్ తో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో దూసుకు పోతుంది. ప్రస్తుతం, ఇది ప్రైమ్ వీడియోలో టాప్ లో ట్రెండ్ అవుతోంది. నాగ చైతన్య ప్రధాన పాత్రలో ఉండటంతో ఆ ప్రభావం రెట్టింపు అయ్యింది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. ధూతలో ప్రియా భవానీ శంకర్, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్, పశుపతి, రవీంద్ర విజయ్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై శరత్ మరార్ ఈ సిరీస్‌ని నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు