“రామాయణ్” కోసం కీలక శిక్షణ స్టార్ట్ చేసిన సూపర్ స్టార్

“రామాయణ్” కోసం కీలక శిక్షణ స్టార్ట్ చేసిన సూపర్ స్టార్

Published on Mar 26, 2024 8:05 PM IST

“రామాయాణం” ఇది వెండితెరపై ఎన్నో సార్లు చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే గొప్ప కావ్యం. మరి ఈ కథపై ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలు వచ్చాయి వస్తున్నాయి. అలా బాలీవుడ్ సినిమా నుంచి భారీ లెవెల్లో రామాయణం సినిమా తెరకెక్కనుండడం ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా దర్శకుడు నితీష్ తివారి (Nitish Tiwari) కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ భారీ సినిమా పట్ల గట్టి హైప్ నెలకొంది.

అయితే ఈ చిత్రంపై అఫీషియల్ అనౌన్సమెంట్ ఇంకా రాలేదు కానీ ఈ చిత్రం ఉందని అందరికీ తెలుసు. అయితే ఈ సినిమాలో రణబీర్ రాముని పాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు తాను కసరత్తులు మొదలు పెట్టాడు. విలు విద్యతో మొదటిగా స్టార్ట్ చేసి ప్రస్తుతం ఈ శిక్షణలో బిజీగా ఉన్నట్టుగా బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి.

రీసెంట్ గా కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. మరి రీసెంట్ గానే “అనిమల్” కోసం రణబీర్ సాలిడ్ ఫిజిక్ ని మైంటైన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రామాయణ (Nitish Tiwari’s Ramayan) కోసం కూడా కొత్త మేకోవర్ లోకి మారనున్నాడు. మరి చూడాలి ఈ సినిమాకి మేకర్స్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు