కృష్ణ చేతుల మీదుగా ‘ఐనా ఇష్టం నువ్వు’ లోగో లాంచ్

Aina-Ishtam-Nuvvu-logo-laun
సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా పరిచయం కానున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన రామ్ ప్రసాద్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై చంటి అడ్డాల నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమాకు ‘ఐనా ఇష్టం నువ్వు’ అనే పేరు ఖరారు చేశారు.

ఈ ఉదయం ఈ టైటిల్ లోగో, టీజర్‌ను సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మలు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా కృష్ణ ఈ సినిమా మంచి విజయం సాధించాలని కాంక్షించారు. నాగబాబు, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి తదితరులు నటించిన ఈ సినిమాకు అచ్చు సంగీతాన్ని సమకూర్చారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version