ఫ్యాన్స్ కి.. ‘మహేష్’ వెరీ ఇంట్రస్టింగ్ ఆన్సర్స్ !

Published on May 31, 2020 9:36 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ఏకంగా తనతోనే ముచ్చటించే బంపర్ ఆఫర్ ను తన అభిమానులకు ఇవ్వడంతో.. మహేష్ ఫ్యాన్స్, ఇన్ స్టాగ్రామ్ వేదికగా మహేష్ తో చాట్ చేశారు. మరి ఈ ఆసక్తికరమైన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏమిటో చూద్దాం.

ఓ అభిమాని ‘సమంత, రష్మిక వీరిలో మీకు ఎవరు ఇష్టం ?’ అని అడగగా.. ‘నేను వారిద్దరికీ చాలా ఇష్టం, ఇద్దరూ మంచి కో స్టార్స్’ అని మహేష్ ఆన్సర్ ఇచ్చారు. మణి అనే మరో అభిమాని ‘మిమ్మల్ని జేమ్స్ బాండ్ సినిమాలో చూడాలనుకుంటున్నాం. భవిష్యత్తులో మీ నుండి జేమ్స్ బాండ్ సినిమాను ఎక్స్ పెక్ట్ చెయ్యొచ్చా ?’ అని అడగగా.. ‘మణి నువ్వు పంపగలిగితే స్క్రిప్ట్ పంపు, బాగుంటే చేద్దాం’ అంటూ మహేష్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

ఇంకో అభిమాని ‘హాయ్ సర్, రాజమౌళిగారితో మీ మూవీని మేము ఎప్పుడు ఎక్స్ పెక్ట్ చెయ్యొచ్చు ?’ అని అడగగా.. ‘మీరు కచ్చితంగా ఎక్స్ పెక్ట్ చెయ్యొచ్చు. ఆయనతో సినిమా కోసం నేను కూడా చాల ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు. అలాగే మరో అభిమాని ‘మీ ఫేవరేట్ క్రికెటర్ ఎవరు ?’ అని అడగగా.. ‘మహేంద్ర సింగ్ ధోని, కోహ్లీ, అలాగే మై ఆల్ టైమ్ ఫేవరేట్ సచిన్’ అని అన్నారు.

మరో అభిమాని ‘సర్కారు వారి పాట’ సినిమాలో మెయిన్ థీమ్ ఏమిటి ?’ అని అడగగా.. ‘సర్కారు వారి పాట’ సినిమా స్ట్రాంగ్ మెసేజ్ తో సాగే ఫుల్ ఎంటర్ టైనర్. నిజంగా ఈ సినిమా పై నేను చాల ఆసక్తిగా ఉన్నాను’ అని చెప్పారు. ‘మీకు వెబ్ సిరీస్ లు ఇష్టమేనా ?’ అని ఓ అభిమాని ప్రశ్నించగా.. ఇప్పుడే ‘డిఫెండింగ్ జాకోబ్’ అనే వెబ్ సిరీస్ చూశాను, వెరీ ఇంట్రస్టింగ్. చాల బాగుంది’ అని మహేష్ చెప్పారు.

సంబంధిత సమాచారం :

More