సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార చాలా ఎనర్జిటిక్ గా సరదాగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. సితార సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. తన తండ్రి అభిమానుల కోసం సితార అప్పుడప్పుడు తనకు సంబంధించిన వీడియోలు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానుల్ని అలరిస్తుంటుంది.
కాగా తాజాగా సితార తన అన్నయ్య గౌతమ్ గురించి ఓ వీడియోలో చెబుతూ ‘మా అన్నయ్య గౌతమ్ ఒక పెద్ద ఫ్యామిలీ గాయ్’ అని చెప్పింది. మహేష్ ఆ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియోను మహేష్ అభిమానులు షోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ సూపర్ స్టార్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు.


