సూపర్ స్టార్ సినిమా టీజర్ విడుదల ఆ రోజేనా ?

Published on Aug 1, 2018 12:32 pm IST

తమిళ్ స్టార్‌ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో సూపర్‌ స్టార్ రజనీకాంత్ హీరోగా బాలీవుడ్ స్టార్‌ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా రూపొందుతున్న అత్యంత భారీ చిత్రం 2.ఓ. తెలుగు తమిళ ప్రేక్షకులతో పాటు హిందీ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించి చిత్రీకరణ ఇప్పటికే పూర్తి కాగా చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది.

తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం విజువల్‌ వండర్ గా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ ను ఆగస్టు 15వ తేదీన గ్రాండ్ గా విడుదల చెయ్యాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారని సమాచారం. ఐతే ఈ విషయానికి సంబంధించి చిత్రబృందం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుందట.

సంబంధిత సమాచారం :

X
More