ఆసక్తి రేపుతున్న “మాయ‌” ఫ‌స్ట్‌లుక్‌ పోస్టర్.!

ఆసక్తి రేపుతున్న “మాయ‌” ఫ‌స్ట్‌లుక్‌ పోస్టర్.!

Published on Oct 14, 2020 11:00 AM IST

ప్రవాస భారతీయురాలైన రాధికా జయంతి దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `మాయ`. సంధ్య బయిరెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ పోషించ‌గా, రోహిణి కుమార్, అభిషేక్, ఐడా, మధు, మహిమా ఇత‌ర పాత్రధారులుగా నటించారు. రేస‌న్ ప్రొడ‌క్ష‌న్స్‌, విఆర్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకాల‌పై గోపికృష్ణ జ‌యంతి నిర్మించారు. ప్ర‌ముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ డ‌స్టిన్ లీ ఈ చిత్రానికి వ‌ర్క్ చేయ‌డం విశేషం. ఇప్ప‌టికే విడుద‌లైన ప్రీ లుక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ రాగా `మాయ`ఫ‌స్ట్‌లుక్‌ని ఇటీవ‌ల ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడు‌ద‌ల‌చేశారు. అయితే ఈ ఫ‌స్ట్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండ‌డంతోపాటు సినిమా మీద క్యూరియాసి‌టీని పెంచి ప్రేక్ష‌కుల‌ని ఇంప్రెస్ చేస్తోంది.

ఈ సంద‌ర్భంగా.నిర్మాత గోపికృష్ణ జ‌యంతి‌ మాట్లాడుతూ – “ప్రీ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తున్నందుకు హ్యాపీగా ఉందిని. పూర్తిగా సినిమా ఇండ‌స్ట్రీ ప‌ట్ల ప్యాష‌నేట్ టీం తో కంప్లీట్‌గా అమెరికాలోని రిచ్ లొకేష‌న్స్‌లో `మాయ` మూవీ ని తెర‌కెక్కించ‌డం జ‌రిగింది. మేకింగ్‌లో హాలీవుడ్ ఇండ‌స్ట్రీలో శిక్ష‌ణ తీసుకున్న రాధిక జ‌యంతి ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అవుతున్నారు. హాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ డ‌స్టిన్ లీ విజుల‌వ్స్ త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌ని థ్రిల్ చేస్తాయి. పలు లఘు చిత్రాలకి సంగీతం అందించిన ప్రణీత్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఈ మూవీకి త‌న బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ మూవీ త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌కి ఒక మంచి ఎక్స్‌పీరియ‌న్స్ నిస్తుంది అని అన్నారు.

అలాగే ద‌ర్శకురాలు రాధిక జ‌యంతి మాట్లాడుతూ – “నిర్మాతల స‌హాయంతో అమెరికాలోని రిచ్‌లోకేష‌న్స్‌లో పూర్తి సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రిపాం. ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. అమెరికాలో సింగ‌ర్‌గా సుప‌రిచితుడు అయిన కార్తిక్ జ‌యంతి ఈ చిత్రానికి క‌థ అందించారు. “మిస్ భార‌త్ యూఎస్ఏ” విన్న‌ర్ సంధ్య టైటిల్‌రోల్ పోషిస్తుండ‌గా ఫ్యాషన్ దివా రోహిణి, అభిషేక్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఒక డిఫ‌రెంట్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ గా ఈ మూవీ త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌ని థ్రిల్ చేస్తుంది. త్వ‌ర‌లోనే టీజ‌ర్ విడుద‌ల‌చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. పోస్టర్ తో మంచి ఆసక్తి రేపిన ఈ చిత్రం తాలూకా టీజర్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు