పొలిటికల్ స్టార్ ని స్పెషల్ గా ఇన్వైట్ చేసిన కృష్ణ

Krishna
ప్రస్తుతం ఘట్టమనేని ఫ్యామిలీలో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ఈ ఏడాది జూన్లో సూపర్ స్టార్ కృష్ణ గారి తమ్ముడైన ఆదిశేషగిరి రావు తనయుడు ఘట్టమనేని రత్నబాబు(బాబీ) నిశ్చితార్ద వేడుక ఘనంగా జరిగింది. ఘట్టమనేని ఫ్యామిలీతో పాటు నారా వారి ఇంట్లోనూ పెళ్లి సందడి మొదలైంది అని చెప్పుకోవాలి, ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు సొంత చెల్లెలి కుమారుడు దద్దల వెంకట దిలిఫ్ కుమార్ తనయురాలు ప్రియాంకనే మన ఘట్టమనేని రత్నబాబు వివాహం చేసుకోనున్నాడు.

వీరిద్దరి వివాహ మహోత్సవం డిసెంబర్ 23 హైదరబాద్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ, ఆయన తమ్ముడు ఆదిశేషగిరి రావు, అలాగే పెళ్ళికొడుకు రత్నబాబు కలిసివెళ్ళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి ప్రత్యేకంగా పెళ్లి పత్రికని ఇచ్చి పెళ్ళికి ఆహ్వానించారు. ఆయన కూడా సూపర్ స్టార్ కృష్ణ అండ్ ఫ్యామిలీతో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించి పెళ్ళికి వీలు చేసుకొని వస్తానని మాటిచ్చాడు. ఈ సందర్భంలో క్లిక్ చేసిన ఓ హ్యాపీ మోమెంట్ ఫోటోని మీరు పైన చూడచ్చు. దీని ప్రకారం డిసెంబర్ 23న ఘనంగా జరగబోయే ఘట్టమనేని రత్నబాబు – ప్రియాంకల మహోత్సవానికి ఘట్టమనేని ఫ్యామిలీలోని స్టార్స్ తో పాటు, నందమూరి మరియు నారా ఫ్యామిలీలోని ప్రముఖులు కూడా హాజరు కానున్నారు.

Exit mobile version