హారర్‌ చిత్రాల్లో రవిబాబు మాష్టర్‌’ – మహేష్ బాబు

aa

‘అనసూయ, నచ్చావులే, అనసూయ, అవును’ లాంటి చిత్రాలతో తన ప్రత్యేక శైలిని చాటుకున్న దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో తాజాగా రాబోతున్న చిత్రం ‘ఆవిరి’. రీసెంట్ గా ఈ సినిమా నుండి టీజర్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఆవిరి టీజర్‌ ను చూసిన సూపర్ స్టార్ మహేష్‌ బాబు ఈ సినిమా గురించి స్పందిస్తూ.. ‘అన్ని చిత్రాల్లోకెల్లా హారర్‌ జానర్‌ మూవీసే ఎక్కువుగా ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి హారర్ మూవీస్ ను తీయడంలో రవిబాబు మాష్టర్‌’.. ‘ఆవిరి’ చిత్ర యూనిట్ కి, డైరెక్టర్ రవిబాబుకి ఆల్‌ ది బెస్ట్‌’ అని మహేష్ బాబు ఫేస్‌ బుక్‌ లో పోస్ట్‌ చేశారు.

ఇక గత కొన్నాళ్ళుగా రవిబాబుకి సరైన హిట్ లేదు. ఆయన చివరి ప్రయోగాత్మక చిత్రం ‘అదుగో’ కూడా పరాజయం చెందింది. దీంతో ‘ఆవిరి’ పేరుతో కొత్త ప్రయత్నం చేస్తున్నారు రవిబాబు. ‘మీ ఇంట్లో మీకు తెలియకుండా ఒక ఆత్మ అతిథిగా మీతో పాటే ఉంటే ? ఆ అతిథే ఆవిరైతే ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ? అనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లోనూ బాగానే ఆసక్తి ఉంది.

కాగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌ లో రిలీజ్‌ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో రవిబాబు నటించి, నిర్మించి, దర్శకత్వం వహించారు. నేహా చౌహాన్, శ్రీముక్త, భరణి శంకర్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.

Exit mobile version