మహేశ్ కొత్త సినిమా అప్ డేట్.. ఈ రోజు రాత్రి 12 గంటలకు !

Published on May 30, 2019 6:32 pm IST

మహేశ్ బాబు తన తరువాత సినిమాను అనిల్ రావిపూడితో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మే 31వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో 9.18 amకి అధికారికంగా పూజ కార్యక్రమంతో ఈ సినిమా ప్రారంభం కానుంది. కాగా తాజాగా దిల్ రాజు నిర్మాణ సంస్థ తమ సోషల్ మీడియా ఎకౌంట్ లో ఈ సినిమాకి సంబంధించి మరో లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చింది. ఈ రోజు రాత్రి 12 గంటలకు ఈ సినిమాకు సంబంధించి ఏదో అధికారికంగా ప్రకటించబోతున్నట్లు అర్ధం వచ్చేలా ట్వీట్ చేసింది.

ఇక మహేశ్ బాబు ‘మాహర్షి’తో భారీ సక్సెస్ ను అందుకున్న తరువాత చేస్తోన్న సినిమా కావడంతో, ఈ సినిమా పై అత్యంత భారీ అంచనాలే ఉంటాయి. ఇక ఇటీవలే ‘ఎఫ్ 2’తో భారీ హిట్ ను కొట్టాడు అనిల్. మరి మహేశ్ తో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి. ఈ సినిమాలో ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే విజయశాంతి మహేష్ బాబుకు అత్తగా నటించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు

సంబంధిత సమాచారం :

More