‘సూపర్ స్టార్’ సినిమా ఏభై రోజుల రికార్డ్ !

కొరటాల శివ దర్శకత్వంలో ‘సూపర్ స్టార్ మహేష్ బాబు’ హీరోగా నటించిన పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘భరత్ అనే నేను’ చిత్రం. ఇప్పుడు ఈ చిత్రం కొత్త రికార్డ్స్ వైపు దూసుకెళ్తుంది. బాహుబలి తర్వాత ‘భరత్ అనే నేను’ చిత్రమే బిగ్గెస్ట్ వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సినిమా విడుదల ముందు నుండే పాజిటివ్ బజ్ ఉండటం, సినిమా విడుదలైన తర్వాత కూడా సూపర్ హిట్ టాక్ రావడంతో బ్లాక్ బస్టర్ గా నిలిచి ఇంకా థియేటర్లో సందండి చేస్తూనే ఉంది. ఎంతటి బ్లాక్ బస్టర్ అయినా ఎంతటి స్టార్ హీరో నటించిన చిత్రమైనా ఈ రోజుల్లో రెండు వారాలు ఆడితేనే మహా గొప్ప.

అలాంటి పరిస్థితుల మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ చిత్రం మాత్రం విజయవంతంగా 50వ రోజు జరుపుకుంది. మహేష్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. ‘భరత్ అనే నేను’ చిత్రంకు ముందు వరుస ప్లాప్ లతో సతమతమైన మహేష్ బాబుకు ఈ చిత్ర విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మహేష్ బాబు తన తర్వాత సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నారు.

Exit mobile version