కలాం కు నివాళి అర్పించిన రజినీ

rajinikanth
భారతదేశ ప్రముఖ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఈ నెల 27న అర్ధాంతరంగా తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసినదే. ఈ ఘటనతో యావత్ భారతావని దిగ్బ్రాంతికి గురయ్యింది. సాధారణ ప్రజలేకాక ఎంతోమంది ప్రముఖులు సైతం ఈ మహనీయ మూర్తికి నివాళిని అర్పించారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కలాం ని స్మరించుకున్నారు.
“నాకు గాంధీజీ, కామరాజ్, భారతీయార్ కలిసే అవకాశం దక్కలేదు. కానీ కలాం గారితో కలిసి జీవించాను.

సాదా జీవితం గడుపుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించిన కలాం గారి జీవితం ఎంతోమందికి స్పూర్తిని కలిగిస్తుంది.

విద్యార్ధులకు కలాం అందించిన సందేశాలు వెలకట్టలేనివి. దేవుడు కూడా ప్రేమతో ఆయన్ని తీసుకుపోయాడు. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక” అని రజినీ పోస్ట్ చేశారు .

Exit mobile version