ఇంటర్వెల్ షూట్ కి సూపర్ స్టార్ రెడీ !

ఇంటర్వెల్ షూట్ కి సూపర్ స్టార్ రెడీ !

Published on Feb 8, 2021 9:19 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ షూట్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నాడట. వచ్చే వారం అనంతరం షూటింగ్ పెట్టుకుందామని మేకర్స్ కి రజిని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడట. కాగా యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా ఇంటర్వెల్ సీన్స్ ను ముందుగా షూట్ చేస్తారట. ఆ తరువాత రజిని – ఖుష్బూ కలయికలో వచ్చే ఫ్యామిలీ సీన్స్ తీస్తారని తెలుస్తోంది. కాగా ఖుష్బూ ఈ సినిమా కోసం బరువు తగ్గి సరికొత్తగా రెడీ అయింది.

ఇక రజనీ – ఖుష్బూలది హిట్ కాంబినేషన్. గతంలో రజనీ, ఖుష్బూలు కలిసి ‘అన్నామలై, మన్నన్, పాండియన్, నట్టుక్కు ఓరు నల్లవన్’ వంటి సినిమాల్లో కలిసి చేశారు. మళ్లీ చాలా సంవత్సరాలు తరువాత ఇప్పుడు కలిసి నటిస్తున్నారు. అన్నట్టు ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుష్బూ మాట్లాడుతూ.. ‘రజిని సర్ కాబట్టే.. ఈ సినిమా చేస్తున్నాను. అలాగే నా పాత్ర కూడా నాకు కొత్తగా అనిపించింది’ అని ఖుష్బూ చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు