సల్మాన్ ఖాన్‌ను డైరెక్ట్ చేస్తానంటున్న ‘సైరా’ దర్శకుడు

Published on Sep 9, 2019 5:40 pm IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రం విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. రూ. 270 కోట్ల భారీ వ్యయంతో రూపొందిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రంతో ఆయన పేరు బాలీవుడ్లో సైతం చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం ‘సైరా’ హిందీలో భారీ ఎత్తున విడుదలకానుంది. కాబట్టి ఓపెనింగ్స్ విపరీతంగా ఉంటాయని, ఒకవేళ చిత్రం హిట్టైతే రికార్డ్ స్థాయి వసూళ్లు నమోదవుతాయి.

అదే జరిగితే దర్శకుడు సురేందర్ రెడ్డికి బాలీవుడ్ స్టార్ హీరోలు పిలిచి మరీ ఆఫర్లు ఇవ్వడం ఖాయం. ఇదే ప్రస్తావనలో సల్మాన్ ఖాన్‌ను డైరెక్ట్ చేస్తారా అనే ప్రశ్న రాగా సల్మాన్ ఖాన్‌కు హైదరాబాద్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారని, ఆయన సినిమాల్ని మొదటిరోజు మొదటి షో చూస్తానని, అయినా తర్వాతి సినిమా గురించి ఇంకా ఏమీ అనుకోలేదని అంటూ ఒకవేళ
తనపై నమ్మకముంచి సల్మాన్ అవకాశం ఇస్తే తప్పకుండా ఆయనతో వర్క్ చేయడానికి తాను సిద్దమేనని అన్నారు సురేందర్ రెడ్డి. మరి అక్టోబర్ 2న విడుదలకానున్న ‘సైరా’తో సురేందర్ రెడ్డి ఆ అవకాశాన్ని అందుకుంటారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More