అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ సురేందర్ రెడ్డితో కన్ఫర్మ్ అయ్యింది. అఖిల్ ఇప్పటి వరకు తీసిన మూడు చిత్రాలు కూడా వైఫల్యం చెందినప్పటికీ తన నెక్స్ట్ ప్రాజెక్టుల మీద మంచి అంచనాలు ఎప్పటికప్పుడు భారీగా నెలకొనడం అతనికి కెరీర్ కు ప్లస్ పాయింట్. అలా ఇప్పుడు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్న మోస్ట్ “ఎలిజబుల్ బ్యాచులర్”కు అలానే జరిగింది.
ఇక ఇది లైన్ లో ఉండగా దర్శకుడు సురేందర్ రెడ్డితో కూడా ఒక ప్రాజెక్ట్ ఖరారు కావడంతో టాలీవడ్ ఆడియెన్స్ కళ్ళు ఇపుడు ఈ ప్రాజెక్ట్ పై పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే సురేందర్ రెడ్డి కూడా అఖిల్ తో ఓ ఇంట్రెస్టింగ్ సినిమానే చెయ్యనున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని ఒక స్పై థ్రిల్లర్ గా సురేందర్ రెడ్డి ప్లాన్ చేయనున్నట్టు టాలీవుడ్ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.


