సైరా అప్పుడు చేసుంటే 500కోట్ల బడ్జెట్ అయ్యుండేది

Published on Sep 19, 2019 1:06 pm IST

సైరా చేయాలన్న ఆలోచన ఇప్పటిది కాదు అని రామ్ చరణ్ అలానే చిరంజీవి పలు సందర్భాలలో చెప్పడం జరిగింది. పదేళ్ల క్రితమే సైరా ప్రాజెక్ట్ చేయాలన్న ఆలోచనకు నాంది పడింది.ఐతే అప్పుడు ఈ చిత్రాన్ని నిర్మించకపోవడానికి గల కారణాలను దర్శకుడు సురేందర్ రెడ్డి నిన్న పాత్రికేయుల సమావేశంలో వివరించారు.

పదేళ్ల క్రితం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం తో సైరా మూవీ చేస్తే 500కోట్ల బడ్జెట్ వరకు అవసరం అయ్యేదని అన్నారు. అలాగే ఇప్పుడు తెరకెక్కించినంత క్వాలిటీ కూడా వచ్చేది కాదని ఆయన చెప్పారు. సైరా మూవీ బడ్జెట్ పరిమితుల రీత్యా మాత్రమే ఇన్నేళ్లు ఆగాల్సి వచ్చిందని ఆయన ఆలస్యం వెనుక అసలు కారణం చెప్పారు. అలాగే సైరా చిత్రం కొరకు ఆయన నెలల తరబడి అధ్యనం చేశామని, తెలిపారు. అలాగే రామ్ చరణ్ మాట్లాడుతూ మానాన్న గారి ఒక కొడుకుగా నేను ఇస్తున్న అతిపెద్ద గిఫ్ట్ సైరా చిత్రం అని ఆయన తెలపడం జరిగింది.

కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార, తమన్నా నటిస్తుండగా…,అమితాబ్,జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇతర కీలకపాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం అమిత్ త్రివేది.

సంబంధిత సమాచారం :

X
More