తేజ ‘హోరా హోరీ’లో భాగస్వామి అయిన సురేష్ బాబు

Suresh-babu
గతంలో పలు బ్లాక్‌బస్టర్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు తేజ, ఈ మధ్య కాలంలో తనదైన మార్క్ సినిమా తీయలేకపోయారు. తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలు విమర్శకుల పరంగానూ, బాక్సాఫీస్ పరంగానూ పరాజయం పొందాయి. ఈ నేపథ్యంలో వస్తోన్న ఆయన కొత్త సినిమా ‘హోరా హోరీ’ విషయంలో మాత్రం మొదట్నుంచీ మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఈ సినిమా ద్వారా తేజ మళ్ళీ తనదైన లవ్‌స్టోరీని తెరకెక్కించారనే టాక్ వినబడుతోంది.

అంతా కొత్తవాళ్ళతోనే తేజ రూపొందించిన ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. కళ్యాణ్ కోడూరి అందించిన మ్యూజిక్ ఇప్పటికే మంచి హిట్ అయింది. ఇక విడుదలకు ముందే పాజిటివ్ వైబ్రేషన్‌తో ఉన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈమధ్యే చూశారు. సినిమా బాగా నచ్చడంతో హోరా హోరీ నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్‌తో కలిసి సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మార్కెట్లో మంచి క్రేజ్ ఉన్న ఈ సినిమాకు సురేష్ బాబు భాగస్వామ్యంతో మరింత హైప్ వస్తుందనే చెప్పాలి.

Exit mobile version