మూవీ మొఘల్ కి సురేష్ బాబు ఘనమైన నివాళి

suresh-ramanaidu
స్వర్గీయ రామానాయుడు గారిని కలకాలం గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన తనయుడు సురేష్ బాబు. ఈ ప్రముఖ నిర్మాత తన తండ్రి అస్తికలను వారణాసి, అలహాబాద్, గోదావరి దగ్గర పుణ్య నదులలో కలిపాడు.

ఈ జూన్ 6వ తారీఖున రామానాయుడుగారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పేరుమీద ఒక అంతర్జాతీయ అవార్డును ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అక్కినేని అవార్డు ఇటువంటి పద్ధతినే ఫాలో అవుతున్న విషయం తెలిసినదే. రామానాయుడు గారు సైతం పలు భాషలలో బాగా పాపులర్ గనుక ఈ అవార్డ్ కూడా త్వరగా దేశవ్యాప్త ప్రసిద్ధి అయ్యే సూచనలు వున్నాయి. రామానాయుడు స్టూడియోస్ దగ్గర ఆయన చితిని తగలబెట్టిన చోట ఒక చిన్న మొక్కను నాటడం ఆనందకరం.

Exit mobile version