రానా నిర్మాతగా క్రికెటర్ బయో పిక్

రానా నిర్మాతగా క్రికెటర్ బయో పిక్

Published on Jul 30, 2019 4:08 PM IST

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయో పిక్ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. కొద్దిరోజుల క్రితమే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని దార్ మీడియా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.

ఐతే తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ నిర్మాణ భాగస్వామిగా సురేష్ ప్రొడక్షన్స్ జాయిన్ అయ్యింది. ఈ విషయాన్నీ స్వయంగా రానా దగ్గుబాటి ధృవీకరించారు. ఇప్పటికే ఈ బయో పిక్ నిర్మాతలుగా ఉన్న దార్ మీడియా ప్రొడక్షన్స్ తో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. డిసెంబర్ నుండి సెట్స్ పైకెళ్లనున్న ఈ చిత్రానికి టైటిల్ గా “800” పరిశీలనలో ఉంది. ఆయన టెస్ట్ క్రికెట్ లో సాధించిన అత్యధిక వికెట్లకు గుర్తుగా ఈ టైటిల్ నిర్ణయించే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు