కొద్దిరోజుల క్రితమే ‘మెంటల్ మదిలో’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న హీరో శ్రీ విష్ణు చేసిన చిత్రం ‘నీది నాది ఒకే కథ’. నూతన దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ గా ఉండనుంది. ఇటీవలే విడుదలైన మోషన్ పోస్టర్, పాటలకు మంచి స్పందన దక్కింది.
చిత్ర టీమ్ కూడ సరైన విడుదల తేదీ కోసం ఇన్ని రోజులు ఎదురుచూసి మార్చి 23 అయితే అన్ని విధాల సౌకర్యంగా ఉంటుందని ఆ రోజునే సినిమాను విడుదలచేయాలని నిర్ణయించారు. ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవిష్ణు స్నేహితుడు, హీరో నారా రోహిత్ తన అరన్ మీడియా వర్క్స్ బ్యానర్ పై సమర్పిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ‘బిచ్చగాడు’ ఫేమ్ సాట్నా టైటస్ హీరోయిన్ గా నటించింది.
