‘కాప్పన్’ మూవీతో ఇటీవలే ప్రేక్షకుల్ని పలకరించినా హీరో సూర్య తన తర్వాతి సినిమాని దర్శకుడు హరితో ఫైనల్ చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ‘సింగం’ ప్రాంఛైజీలోని సినిమాలే. ఈ సారి కూడా వీరిద్దరూ అలాంటి పోలీస్ స్టోరీతోనే సినిమా చేస్తారని అనుకున్నారంతా. కానీ అలా చేయట్లేదట. ఇప్పటికే ‘సింగం’ సిరీస్ నందు మూడు సినిమాలు చేసి ఉండటంతో ఈ సారి వైవిధ్యమైన కొత్త తరహా కథను చూజ్ చేసుకున్నారట.
ఇది పక్కా మాస్ స్క్రిప్ట్ అయిన ‘సింగం’ సినిమాల తరహాలో పోలీస్ కథలా ఉండదట. ఈ విషయం తెలిసిన సూర్య ఫ్యాన్స్ గతంలో చేసిన ‘ఆరు, వేల్’ లాంటి డిఫరెంట్ సినిమా ఏదైనా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. మరి ఆరవసారి కలిసి పనిచేస్తున్న సూర్య, హరిలు ఎలాంటి సినిమాను అందిస్తారో చూడాలి. అయితే ఈ మధ్య సూర్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుస డిజాస్టర్ లుగా నిలుస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో సూర్య నటిస్తున్న ఈ సినిమాతోనైనా సూర్య మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.


