మహేష్ బాబుకి చాలెంజ్ విసిరిన సూర్య

మహేష్ బాబుకి చాలెంజ్ విసిరిన సూర్య

Published on Sep 17, 2014 3:47 PM IST

surya-mahesh-babu
తమిళ స్టార్ హీరో సూర్యకి తమిళంలో ఎంత్ క్రేజ్ ఉందో తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉంది. సూర్య హీరోగానే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటాడు. ఇటీవలే బాగా ఫేమస్ అయిన చాలెంజ్ ఐస్ బకెట్ చాలెంజ్.. దీనికి కొనసాగింపుగా మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక చెట్టుని నాటాలి అని కొత్త చాలెంజ్ ని మొదలు పెట్టాడు. ఈ చాలెంజ్ ని మమ్ముట్టి చేసి ప్రతి సెలబ్రిటీ ఒక చెట్టు నాటి వారికి నచ్చిన వారికి ఆ చాలెంజ్ ఇవ్వాలని చాలెంజ్ చేసారు.

అందులో భాగంగా మమ్ముట్టి సూర్యకి చాలెంజ్ చేసాడు.. మమ్ముట్టి విసిరిన చాలెంజ్ ని స్వీకరించిన సూర్య ఓ చెట్టుని నాటి తనవైపు నుంచి అమీర్ ఖాన్, మహేష్ బాబు, సుధీప్ మరియు వారి అభిమానులకు ఒక చెట్టు నాటమని చాలెంజ్ చేసాడు.

మరి మహేష్ బాబు ఉన్న బిజీ షెడ్యూల్లో మహేష్ బాబు ఈ చాలెంజ్ ని తీసుకొని ఓ చెట్టుని నాటుతారేమో చూడాలి.. అలాగే ఈ సోషల్ అవేర్ నెస్ లో తనూ ఓ భాగం అవుతాడేమో చూడాలి..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు