ఫామ్ లోకి వచ్చిన అన్నయ్య.. తడబడుతున్న తమ్ముడు!

సినీ పరిశ్రమలో ఉన్నటువంటి హీరో బ్రదర్స్ లో స్టార్ నటులు సూర్య అలాగే కార్తీల ద్వయం కూడా ఒకటి. అయితే గత కొన్నేళ్ల వెనక్కి వెళ్తే ఈ ఇద్దరు సోదరుల సినిమాలు వాటి పెర్ఫామెన్స్ లు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని చెప్పాలి. ఈ ఒక్క ఏడాదిలోనే సూర్య రెండు బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ డెలివర్ చేసి ఫామ్ లోకి వచ్చేసి ఆల్రెడీ మూడో సినిమా కూడా ఈ ఏడాది దింపబోతున్నారు.

కానీ ఈ సమయంలో తన తమ్ముడు సినిమాలు మాత్రం వరుసగా ప్లాప్ అవుతూ వస్తున్నాయి. గత ఏడాది అంతకు ముందు చూసుకుంటే సూర్య సినిమాలు థియేట్రికల్ గా వరుసగా పరాజయాలు ఎదుర్కొంటే కార్తీ మధ్యలో సత్యం సుందరం తో పర్వాలేదు అనిపించాడు.

తీరా అన్న ఫామ్ లోకి వచ్చేసాక కార్తీ నుంచి సాలిడ్ హిట్ అవుతుంది అనుకున్న పాన్ ఇండియా చిత్రం సర్దార్ 2 కి డివైడ్ టాక్ వచ్చేసింది. దీనితో అన్నయ్య అలా ఉంటే తమ్ముడు పరిస్థితి ఇప్పుడు ఇలా మారింది. మరి కార్తీ మళ్ళీ ఎప్పుడు ఫామ్ లోకి వస్తాడో చూడాలి. కార్తీ చేతిలో తెలుగు దర్శకుల సినిమాలే రెండు ఉన్నాయి. సో వీటితోనే కంబ్యాక్ ఇస్తాడేమో చూడాల్సిందే.

Exit mobile version