‘బాహుబలి’లో ఒక్క షాట్ అయినా ఓకే – సూర్య

‘బాహుబలి’లో ఒక్క షాట్ అయినా ఓకే – సూర్య

Published on Aug 1, 2014 11:40 AM IST

surya-rajamouli
దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. ఈ సినిమాలో నటించాలని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కోరుకుంటున్నారు. ఇందుకు ‘సికిందర్’ సూర్య మినహాయింపు కాదు. ‘బాహుబలి’లో సూర్య నటించడం లేదు అని చిత్ర బృందం ప్రకటించింది. కాని సూర్య మాత్రం ‘బాహుబలి’లో నటించాలనే కోరిక మీడియా ముందు వెల్లడించాడు.

ప్రతి ఒక్కరూ జీవితంలో పొరపాట్లు చేయడం సహజం. నేను ఒక పొరపాటు చేశాను. రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశం వదులుకున్నాను. ‘బాహుబలి’లో కనీసం ఒక్క షాట్ లో అయినా నటించే అవకాశం ఉంటె ఇవ్వండి. అని ‘సికిందర్’ ఆడియోలో రిక్వెస్ట్ చేశారు. మరి రాజమౌళి సూర్య విన్నపాన్ని మన్నిస్తారా..?

సంబంధిత సమాచారం

తాజా వార్తలు