
తాజా సమాచారం ప్రకారం సూర్య తన కుటుంబ సభ్యులతో కలసి సుధీర్గ విరామం లో వున్నారు. ఇటివలే లింగు స్వామి దర్శకత్వం వహిస్తున్న ‘అంజాన్’ చిత్రం లో ఒక ముఖ్యమైన షెడ్యూల్ ని ఒక పాట మినహా మొత్తం చిత్ర షూటింగ్ ని సూర్య పూర్తి చేసారు. ఈ చిత్రం లో సమంత హీరోయిన్ గా నటిస్తుంది.
తాజా సమాచారం ప్రకారం ఒక నెల తర్వాత యు.యెస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ‘అంజాన్’ మిగతా షూటింగ్ పూర్తి చేయనున్నాడు. ఇటీవల గోవా లో ఒక ఏక్షన్ సన్నివేసం చిత్రీకరణ లో 120 కెజీ లు వున్న ఒక ఫైటర్ సూర్య మీద పడడం తో ఆయనకి లిగమెంట్ టెర్ అయింది. అందువలన సూర్య కి కాస్తా విశ్రాంతి అవసరం అయింది అయితే ఆ గాయం బయపాడాల్సినంత పెద్దది కాదని సూర్య సన్నిహిత వర్గాల సమాచారం.
‘అంజాన్’ తెలుగు తమిళ్ బాషల్లో ఆగస్ట్ లో విడుదల కానుంది. ఆ తర్వాత వెంకట ప్రభు దర్శకత్వం వహించనున్న మరో చిత్రం లో సూర్య నటించనున్నాడు. ఈ చిత్రం లో నయన తార సూర్య తో జత కట్టనుంది.