‘మాస్’ సెన్సార్ రిపోర్ట్‌తో సూర్య హ్యాపీ!

masss-poster
సరికొత్త కథలతో, విభిన్న గెట‌ప్‌లతో మనల్ని మెప్పిస్తూ ఉండే తమిళ సూపర్ స్టార్ సూర్య, తాజాగా ‘మాస్’ పేరుతో మరో సరికొత్త కథతో మనముందుకు రానున్న విషయం తెలిసిందే! ఈ సినిమా తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో విడుదల కానుంది. ఈ సినిమాకు తమిళంతో పాటు తెలుగులోనూ భారీ క్రేజ్ ఉంది. సూర్యకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సూర్య తన సొంత బ్యానర్‌ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మించారు.

తాజాగా మాస్ తమిళ వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బృందం ఈ సినిమాకు ‘యూ’ సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ తరపున ఈ సినిమాకు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు యూ సర్టిఫికెట్ జారీ కావడం పట్ల సూర్య చాలా హ్యాపీగా ఉన్నారు. ‘మాస్’ సినిమా దయ్యం నేపథ్యంలో నడిచే ఓ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అయినా పిల్లలు కూడా నిరభ్యంతరంగా చూడగలిగేలా సినిమా తెరకెక్కిందని సూర్య చెబుతూ వస్తున్నారు. సూర్యకు ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంది.

కాగా ‘మాస్’ విషయంలో ఈ సినిమా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అవ్వడంతో ఫ్యామిలీస్‌కి ఈ సినిమా వర్కవుట్ అవ్వదనే టాక్ వచ్చింది. ఇప్పుడు సెన్సార్ క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వడంతో ఈ వేసవికి అందరూ ఎంజాయ్ చేయదగ్గ ఓ సినిమాగా మాస్‌ తెరకెక్కిందని ఋజువైంది. నయనతార, ప్రణీత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను మే 29న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్న విషయం తెలిసిందే.

Exit mobile version