‘సింగం’ ఫార్ములాను పక్కనబెట్టిన సూర్య

‘సింగం’ ఫార్ములాను పక్కనబెట్టిన సూర్య

Published on Oct 22, 2019 9:13 AM IST

‘కాప్పన్’ చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల్ని పలకరించినా హీరో సూర్య తన తర్వాతి సినిమాను దర్శకుడు హరితో ఫైనల్ చేసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా సూర్య డైరెక్టర్ శివతో సినిమా చేయాల్సి ఉంది. కానీ శివకు రజనీకాంత్ ప్రాజెక్ట్ సెట్టవడంతో హరితో సినిమాకు రెడీ అయ్యాడు సూర్య. వీరి కాంబినేషన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ‘సింగం’ ప్రాంఛైజీలోని సినిమాలే.

ఈసారి కూడా వీరిద్దరూ అలాంటి పోలీస్ స్టోరీతోనే సినిమా చేస్తారని అనుకున్నారంతా. కానీ అలా చేయట్లేదట. ఇప్పటికే ‘సింగం’ సిరీస్ నందు మూడు సినిమాలు చేసి ఉండటంతో ఈసారి కొత్త తరహా కథను చూజ్ చేసుకున్నారట. ఇది పక్కా మాస్ స్క్రిప్ట్ అయిన ‘సింగం’ సినిమాల తరహాలో పోలీస్ కథలా ఉండదట.

ఈ విషయం తెలిసిన సూర్య ఫ్యాన్స్ గతంలో చేసిన ‘ఆరు, వేల్’ లాంటి డిఫరెంట్ సినిమా ఏదైనా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. మరి ఆరవసారి కలిసి పనిచేస్తున్న సూర్య, హరిలు ఎలాంటి సినిమాను అందిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు