
తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా స్టార్ హీరోతో సమానంగా మార్కెట్ తెచ్చుకున్న హీరో సూర్య. సూర్య కూడా పలువురు సెలబ్రిటీల మాదిరిగా తను కూడా తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉండటానికి సోషల్ మీడియా అయిన ట్విట్టర్ లో అడుగుపెట్టాడు. సూర్య ప్రొడక్షన్ హౌస్ అయిన 2డి ఎంటర్ టైన్మెంట్ వారు ఈ వార్తని తెలియజేయడమే కాకుండా సూర్య భార్య జ్యోతిక కంబ్యాక్ ఫిల్మ్ ఫస్ట్ లుక్ స్టిల్స్ ని కూడా రిలీజ్ చేస్తారని తెలియజేశారు.
సూర్యని మీరు కూడా ఫాలో అయ్యి తను పోస్ట్ చేసే విషయాలు తెలుసుకోవాలంటే ఈ ట్విట్టర్ ఐడి ని ఫాలో అవ్వండి – @Suriya_offl .. ఇక నుంచి సూర్య ఈ ట్విట్టర్ ఐడి ద్వారా తన అభిమానులతో రెగ్యులర్ కాంటాక్ట్ లో ఉంటాడని అంటున్నారు. సూర్య ట్విట్టర్ లో జాయిన్ అవ్వడంతో పలువురు ప్రముఖులు తనకి స్వాగతం పలికారు. మరి సూర్య ఏ మేరకు అభిమానులతో టచ్ లో ఉంటాడనేది చూడాలి.

