సూర్య నెక్స్ట్ ను గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టున్నారే.!

Published on Apr 9, 2021 12:58 pm IST

కోలీవుడ్ స్టార్ అండ్ టాలెంటెడ్ హీరో సూర్య లేటెస్ట్ గా “ఆకాశం నీ హద్దురా” చిత్రంతో సాలిడ్ కం బ్యాక్ అందుకున్న సంగతి తెలిసిందే. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ రిలీజ్ అయ్యి భారీ హిట్ అయ్యింది. ఇక ఈ హిట్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన సూర్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు సెట్ చేసుకోగలిగాడు.

మరి అలా ఇప్పుడు దిగ్గజ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తో పాండిరాజ్ దర్శకత్వంలో ఓ ఇంట్రెస్టింగ్ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా మాత్రం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఆ మధ్యన సూర్యపై బయటకి వచ్చిన వర్కింగ్ స్టిల్ నే మంచి వైరల్ అయ్యింది.

ఇప్పుడు సెట్స్ నుంచి ఓ పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లో అన్నట్టుగా సూర్యపై మరో ఫోటో బయటకు వచ్చింది. కత్తి పట్టుకొని నడుస్తున్నట్టుగా సరికొత్త అవతార్ లో సూర్య అనిపిస్తున్నాడు. పంచె కట్టు ఆ హెయిర్ స్టయిల్ అంతా కాస్త మాస్ గా అనిపిస్తున్నాయి. మరి ఈ చిత్రం ఎలా ఉండనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :