కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య గత కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్న అవైటెడ్ కంబ్యాక్ హిట్ చిత్రాన్ని దర్శకుడు ఆర్జే బాలాజీ కరుప్పు సినిమాతో అందించి దుమ్ము లేపాడు. ఇదే సినిమాని తెలుగులో వీర భద్రుడు గా విడుదల చేయగా మన దగ్గర కూడా సినిమా మంచి వసూళ్లు రాబట్టి సూర్య మార్కెట్ ని మళ్ళీ నిలబెట్టింది. అయితే సూర్య నటించిన ఈ సాలిడ్ మాస్ అండ్ యాక్షన్ ఫాంటసీ ఎంటర్టైనర్ ఇప్పుడు ఫైనల్ గా ఓటిటిలో రిలీజ్ కి వచ్చేసింది.
ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో ఒరిజినల్ తమిళ్ వెర్షన్ సెపరేట్ గా తెలుగు వెర్షన్ వీర భద్రుడు సెపరేట్ గా నేటి నుంచి స్ట్రీమింగ్ కి రావడం విశేషం. సో సూర్య గాడ్ మోడ్ ఇక్కడ కూడా క్లిక్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా ఆర్జే బాలాజీ విలన్ గా నటించాడు. అలాగే సాయి అభ్యంకార్ సంగీతం అందించగా డ్రీం వారియర్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
