కరుప్పు : బాక్సాఫీస్ దగ్గర విశ్వరూపం చూపిస్తున్న సూర్య.. ఏకంగా 300 కోట్ల మార్క్..!

తమిళ స్టార్ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీ కాంబోలో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ ‘కరుప్పు’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. డివైన్ ఎలిమెంట్స్‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం, తాజాగా వరల్డ్‌వైడ్‌గా అత్యంత ప్రతిష్టాత్మకమైన రూ.300 కోట్ల గ్రాస్ మార్కును దాటి సరికొత్త చరిత్ర సృష్టించింది.

మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం, రెండు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని ఇప్పుడు అత్యంత గ్రాండ్‌గా 3వ వారంలోకి అడుగుపెడుతోంది. సినిమాలోని విజువల్స్, సూర్య పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టిస్తున్నాయి.

ఈ డివైన్ బ్లాక్‌బస్టర్ చిత్రానికి సాయి అభ్యంకర్ అద్భుతమైన సంగీతాన్ని అందించగా, జి.కె. విష్ణు విజువల్స్ సమకూర్చారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 3వ వారంలో కూడా సూర్య ‘కరుప్పు’ చిత్రం అదే జోరును కొనసాగిస్తూ మరిన్ని వసూళ్ల రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

Exit mobile version