
దాదాపు తన సినిమాలలో ద్విపాత్రాభినయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న తమిళ నటుడు సూర్య ఇప్పుడు మరో అడుగు ముందుకేసాడని సమాచారం. ఫిలింనగర్ కధనాల ప్రకారం సూర్య తన ’24’ ప్రాజెక్ట్ లో మూడు పాత్రలలో అలరించనున్నాడు.
ఈ వార్తపై ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. ఈ చిత్రాన్ని స్వయంగా సూర్యనే నిర్మించడం విశేషం. ఏ.ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సమంతా కధానాయికగా కనిపించనుంది.

