మలయాళ ఫ్యాన్స్ కోసం సూర్య కేరళ ట్రిప్

Suriya

సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న తమిళ స్టార్ హీరో సూర్య. ఈ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘మాస్’. తెలుగులో ‘రాక్షసుడు’గా రానుంది. ప్రస్తుతం సూర్య ఇటు తెలుగు అటు తమిళంలో సినిమాని ప్రమోట్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. రోజూ ఏదో ఓకే అప్లసు కి వెళ్లి సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ఈ సినిమా మే 29న రిలీజ్ కానుంది. సూర్యకి తెలుగు, తమిళంతో పాటు మలయాళంలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

దాంతో సూర్య ఆ సినిమాని మలయమలో కూడా ఎక్కువగా ప్రమోట్ చెయ్యడానికి, అక్కడి అభిమానులను కలవడానికి సిద్దం అయ్యాడు. తాజా సమాచారం ప్రకారం రానున్న రెండు రోజులు సూర్య కేరాలకి వెళ్లి అక్కడ మీడియాతో కలిసి సినిమాని ప్రమోట్ చేయడమే కాకుండా, తన అభిమానులతో కూడా ఇంటరాక్ట్ కానున్నాడు. మాస్ సినిమాని మలయంలో 150కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉండడం వలన మొదటి వారం సూపర్బ్ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Exit mobile version