
తమిళ్ తో పాటు తెలుగులో కూడా స్టార్డం ఉన్న యంగ్ హీరో సూర్య, విభిన్న తరహా సినిమాలు చేసే విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ’24’ అనే ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సూర్య తన సొంత బ్యానర్ 2D ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాలో సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ముందుగా ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ అనుకున్నారు అది కాస్తా సంక్రాంతికి షిఫ్ట్ అయ్యింది. కానీ తాజాగా సంక్రాంతి బరి నుంచి కూడా తప్పుకుందని సమాచారం.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమాని 2016 సమ్మర్ కానుకగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ చిత్ర టీం ఎక్కువ సమయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ సినిమా తెలుగు మూవీ రైట్స్ ని నితిన్ దక్కించుకున్నాడు. ముంబై నేపథ్యంలో నడిచే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కూడా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.