‘సాహో’ దెబ్బకి ‘బందోబస్త్’ వెనక్కి వెళ్ళిపోయింది !

‘సాహో’ దెబ్బకి ‘బందోబస్త్’ వెనక్కి వెళ్ళిపోయింది !

Published on Aug 5, 2019 12:00 AM IST

సూర్య నటిస్తున్న తమిళ సినిమా ‘కప్పాన్’. తెలుగులో ‘బందోబస్త్’గా ఆగస్టు 30న సాహో – గ్యాంగ్ లీడర్ ల సినిమాలతో పాటు ప్రేక్షకుల ముందుకు రావాలని ముందు ప్లాన్ చేసుకున్న.. తాజాగా ‘బందోబస్త్’ విడుదల తేదీని పోస్ట్ ఫోన్ చేసుకుంది. సెప్టెంబర్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక ప్రతి సినిమాలో కొత్తగా కనిపించాలని, ప్రేక్షకులకు డిఫరెంట్ సినిమాలు అందించాలని ప్రతి సినిమాకు స్టైల్ చేంజ్ చేస్తూ సినిమాలు చేసే హీరోల్లో.. సూర్యపేరు ముందు వరుసలో ఉంటుంది.

అందుకే సూర్య ఖాతాలో ‘సింగం’ వంటి పక్కా కమర్షియల్ సినిమాలు… ‘గజినీ’, ‘సెవెన్త్ సెన్స్’, ’24’ వంటి డిఫరెంట్ సినిమాలు… ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ వంటి లవ్ స్టోరీలు ఉన్నాయి. అయితే ఈ మధ్య సూర్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుస డిజాస్టర్ లుగా నిలుస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో సూర్య హీరోగా ‘బందోబస్త్’ బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందో లేదో చూడాలి.

అయితే ఈ సినిమాలో సూర్య ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట. ముఖ్యంగా సూర్య గెటప్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. లైకా మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీకి హేరీశ్ జైరాజ్ సంగీతం అందించారు. ఇప్పటికే పాట‌లకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో ఆర్య‌, స‌యేషా జంట కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మరో ప్రధాన పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు