సూర్య “కంగువ” నుంచి మరో స్టన్నింగ్ లుక్.!

సూర్య “కంగువ” నుంచి మరో స్టన్నింగ్ లుక్.!

Published on Jan 16, 2024 11:58 AM IST


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “కంగువ”. మరి సూర్య కెరీర్ తో అతి పెద్ద చిత్రంగా దీన్ని ప్లాన్ చేస్తుండగా మొదటి నుంచి కూడా సాలిడ్ హైప్ దీనిపై నెలకొంది. మరి ఈ సినిమాలో ఒక ఈవిల్ పాత్ర లాంటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సీన్స్ కోసం సూర్య చేసిన మేకోవర్ ఒక్కసారి అందరినీ ఆకర్షించింది. ఇక ఈ లుక్ తర్వాత ఇదే సినిమా కోసం సూర్య ప్రిపేర్ చేసిన మరో లుక్ పోస్టర్ ని ఇప్పుడు మేకర్స్ రిలీజ్ చేశారు.

మరి ఈ పోస్టర్ లో అయితే మొదటిగా వచ్చిన లుక్ కి కంప్లీట్ డిఫరెంట్ గా చాలా స్టైలిష్ గా సూర్య కనిపిస్తున్నాడు. అది పాత కాలంలోనిది అయితే ఇది ప్రస్తుత కాలానికి చెందిన దానిలా కనిపిస్తుంది. దీనితో సూర్య మరోసారి ప్రయోగాత్మక చిత్రంతో రాబోతున్నాడు అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా గ్రీన్ స్టూడియోస్ మరియు యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు