బల్గేరియాలో సూర్య ‘మాస్’

బల్గేరియాలో సూర్య ‘మాస్’

Published on Dec 1, 2014 6:36 PM IST

Suriya-praises-Kamal-Haasan
తమిళ స్టార్ హీరోగానే కాకుండా తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో సూర్య. సూర్య చేసే పతి సినిమా తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది. చెప్పాలంటే సూర్యకి తమిళ్ కి సమానంగా తెలుగులో కూడా మార్కెట్ ఉంది. ప్రస్తుతం సూర్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మాస్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతోంది.

ప్రస్తుతం బల్గేరియాలో సూర్య పై ఓ పాటని షూట్ చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టీం హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. పాత మాత్రమే కాకుండా ఈ సినిమాకి సంబందించిన ఓ కీలకమైన పార్ట్ ని కూడా షూట్ చేయనున్నారు. ఎప్పటికప్పుడు ఓ చిన్న పాయింట్ తీసుకొని డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను మెప్పించే వెంకట్ ప్రభు ఈ సారి సూర్య కోసం ఓ యాక్షన్ థ్రిల్లర్ కథను రెడీ చేసాడు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు