
సూర్య తదుపరి ప్రాజెక్ట్ ‘మాస్’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా టాకీ భాగం షూటింగ్ ఇటీవలే ముగించింది. ఇటీవలే బల్జేరియాలో షూటింగ్ ముగించుకుని మిగిలివున్న పాటలు, ఫైట్ ల చిత్రీకరణకోసం చిత్రబృందం బ్యాంకాక్ మరియు పాండిచెర్రి వెళ్ళనున్నారు.
ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకుడు. నయనతార, ప్రణీత హీరోయిన్స్. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. స్టూడియో గ్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణమవుతుంది