సూర్య-విక్రమ్ కుమార్‌ల సినిమా మొదలైంది..!

Surya_Vikram
గత సంవత్సరం సికిందర్ (అంజాన్)తో అభిమానులను నిరాశ పరిచిన సూర్య.. 2015లో మాత్రం అలా జరగకుండా ఉండేందుకు సరికొత్త కథాంశాల నేపథ్యంలో సినిమాలు తీస్తున్నారు. ఇప్పటికే ‘మాస్’ సినిమాను దాదాపుగా పూర్తి చేసిన సూర్య తాజాగా ’24’ అనే సినిమా షూటింగ్‌కు షిఫ్టైపోయాడు. ’13బీ’, ‘ఇష్క్’, ‘మనం’ చిత్రాల ద్వారా మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

సైంటిఫిక్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలుపెట్టేశారు. ఈ సినిమాను సూర్య తన సొంత బ్యానర్‌ 2D ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మింస్తుండడం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో డిసెంబర్ నెల్లో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు సూర్య. ’24’ సినిమాకు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక సూర్య నటించిన ‘మాస్’ సినిమా మే 15న గానీ, 23న గానీ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Exit mobile version