సూర్య నెక్స్ట్ సినిమా కథ ఇలానే ఉంటుందట

సూర్య నెక్స్ట్ సినిమా కథ ఇలానే ఉంటుందట

Published on Mar 3, 2020 6:56 PM IST

హీరో సూర్య తన తర్వాతి చిత్రాన్ని హరి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సూర్య, హరిల కాంబినేషన్లో ‘సింగం, ఆరు, వేల్’ లాంటి సినిమాలు వచ్చి ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సూర్యను పోలీస్, ఫ్యామిలీ, మాస్ కథల్లో చూపిన హరి ఈసారి ఎలా చూపబోతున్నారోనని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. అయితే హరి ఫ్యామిలీ స్టోరీకే ఓటు వేశారు. సూర్యను పూర్తి స్థాయి కుంటుంబ కథా చిత్రంలో చూపనున్నారట.

ఒకరకంగా వీరి గత చిత్రం ‘వేల్’ తరహాలో ఉంటుందట కొత్త చిత్రం. ఎప్రిల్ నుండి రెగ్యులర్ షూట్ మొదలుకానుండగా దీపావళికి చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు ‘అరువా’ అనే టైటిల్ నిర్ణయించారు. సినిమా షూటింగ్ ఎక్కువ భాగం సౌత్ తమిళనాడులోనే జరగనుందట. డి.ఇమ్మాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇకపోతే సూర్య తాజా చిత్రం ‘సూరరై పొట్రు’ త్వరలోనే విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు