తెలుగులో సూర్య టార్గెట్ ఇది

Published on May 30, 2019 12:00 am IST

సెల్వరాఘవన్ డైరెక్షన్లో హీరో సూర్య నటించిన ‘ఎన్.జి.కె’ చిత్రం మే 31న తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలకానుంది. సూర్యకి తెలుగునాట మంచి ఫాలోయింగ్ ఉండటం, సెల్వరాఘవన్ గతంలో ‘7జి బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ లాంటి హిట్ సినిమాల్ని అందించి ఉండటంతో ‘ఎన్.జి.కె’పై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ మూలానే డబ్బింగ్ చిత్రమైనప్పటికీ ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది.

ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే 9 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మొదటి రోజు సినిమా బాగుందనే టాక్ వస్తే ఈ టార్గెట్ చేరుకోవడం సూర్యకు పెద్ద కష్టమేమీ కాదు. మరి రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మన తెలుగు ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి కథానాయికలుగా నటించారు.

సంబంధిత సమాచారం :

More