సర్ప్రైజ్ : “సలార్” ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది.!

సర్ప్రైజ్ : “సలార్” ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది.!

Published on Jan 19, 2024 9:00 AM IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన వైలెంట్ యాక్షన్ డ్రామా “సలార్”. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన వచ్చిన ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ లోనే రెండో అతిపెద్ద హిట్ గా అయితే నిలిచింది. ఇక ఈ భారీ చిత్రం కొన్ని థియేటర్స్ ఇప్పటికీ బాగానే రన్ అవుతుంది. మరి ఫైనల్ గా అయితే ఓటిటి రిలీజ్ డేట్ ఇప్పుడు ఈ సినిమా విషయంలో వచ్చేసింది.

ఈ సినిమా ఓటిటి హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ దగ్గర ఉన్న సంగతి తెలిసిందే. మరి సర్ప్రైజింగ్ గా ఈ సినిమా డే ని నెట్ ఫ్లిక్స్ వారు యాప్ లో ఇచ్చేసారు. దీనితో ఈ సినిమా అంటే రేపే జనవరి 20 నుంచే వస్తున్నట్టుగా ఫిక్స్ అయ్యిపోయింది. మరి ఈ భారీ ఎంటర్టైనర్ ని అయితే రేపటి నుంచి విట్నెస్ చెయ్యవచ్చు. ఇక ఈ సినిమాకి రవి బసృర్ సంగీతం అందించగా హోంబాళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు