సర్ప్రైజ్ : ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “డంకి”.!

సర్ప్రైజ్ : ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “డంకి”.!

Published on Feb 15, 2024 7:00 AM IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన చిత్రాలు ఒకటి కాదు రెండు కాదు ముచ్చటగా మూడు సినిమాలు గత ఏడాది థియేట్రికల్ గా వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఆ చిత్రాల్లో రెండు బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్స్ అయితే మూడో చిత్రం “డంకి” క్లాస్ కంటెంట్ తో రావడంతో వాటిలో సగం వసూళ్ళ మేర రాబట్టింది. మరి ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్న వారికి ఇప్పుడు సర్ప్రైజ్ వచ్చింది అని చెప్పాలి.

ఈ సినిమా ఈరోజు నుంచే ఊహించని స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కి వచ్చింది. మరి ఇందులో కేవలం హిందీ భాషలో మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంది. అయితే నిజానికి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు జియో సినిమా వారు సొంతం చేసుకున్నారని మొదట టాక్ వచ్చింది కానీ ఇప్పుడు సర్ప్రైజింగ్ గా నెట్ ఫ్లిక్స్ లోకి ఈ సినిమా రావడం విశేషం. ఇక ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ టాప్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాని కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు